భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు  రూ.2.84 కోట్ల ఆదాయం

భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు  రూ.2.84 కోట్ల ఆదాయం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గత నెల 19 నుంచి ఈ నెల 2 వరకు నిర్వహించిన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రూ.2,84,74,339 ఆదాయం వచ్చినట్లు ఈవో దామోదర్‌‌రావు తెలిపారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం సెక్టార్‌‌ టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ.కోటి 21 లక్షల 43 వేలు లభించాయి. పరోక్ష సేవల టిక్కెట్ల ద్వారా రూ.2.70 లక్షలు, ఆన్‌‌లైన్‌‌ బుకింగ్‌‌ ద్వారా రూ.3,73,860, పోస్టల్‌‌ శాఖ బుక్‌‌ చేసిన అర్చన టిక్కెట్ల ద్వారా రూ.8,69,050 ఆదాయం వచ్చింది.

తలంబ్రాలు పోస్టల్‌‌ శాఖ బుకింగ్‌‌ ద్వారా రూ.11,87,394, ఆర్టీసీ కార్గో ద్వారా రూ.15,87,450, దేవస్థానం వెబ్‌‌సైట్‌‌ బుకింగ్‌‌ ద్వారా రూ.42 లక్షలు, ఆలయం వద్ద తలంబ్రాల ప్యాకెట్ల అమ్మకాల ద్వారా రూ.12.75 లక్షలు వచ్చాయి. ప్రసాదాల అమ్మకాల ద్వారా చిన్నలడ్డూలపై రూ.60,32,725, మహాలడ్డూలపై రూ.3,92,700, పులిహోరాపై రూ.1.26 లక్షలు, చక్కెర పొంగలిపై రూ.12,600, బెల్లం రవ్వ కేసరిపై రూ.4,560 ఆదాయం లభించింది.