ఖమ్మం జిల్లాలో తేనెటీగల పెంపకంతో జీవనోపాధి : ఐటీడీఏ పీవో బి.రాహుల్

ఖమ్మం జిల్లాలో తేనెటీగల పెంపకంతో జీవనోపాధి : ఐటీడీఏ పీవో బి.రాహుల్

భద్రాచలం, వెలుగు: తేనె టీగల పెంపకంపై శిక్షణ తీసుకున్న గిరిజన యువతీ, యువకులు మార్కెట్ సౌకర్యం జీవనోపాధి కల్పించుకుని, ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ సూచించారు. వైటీసీలో ఐదు రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి కిట్లను అందజేశారు. గిరిజనులు సేకరించే తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్​ ఉందని, దానికి అనుగుణంగా శిక్షణ తీసుకున్న యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని తేనెను సేకరించాలన్నారు. 

తేనె ఉత్పత్తి, వ్యాపారం చేసుకునే విధానం, మార్కెటింగ్​ సౌకర్యం కల్పించుకోవడం, వాట్సాప్, ఆన్లైన్​ ద్వారా అమ్ముకునే విధానం, జాగ్రత్తలు, బాక్సులు ఎలా నిర్వహించాలని పీవో వారిని అడిగి తెలుసుకున్నారు.