భద్రాద్రికొత్తగూడెం/ అశ్వారావుపేట/ పాల్వంచ/ ఇల్లందు, వెలుగు : పేషెంట్లకు ఇట్లాంటి భోజనం పెడతారా? గుడ్లు, అరటిపండ్లేవి అంటూ భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మండలంలో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. నాణ్యమైన ఫుడ్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రోగులకు అందించే ఆహారాన్ని పర్యవేక్షించాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, వివిధ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాల్వంచ పాత ఆర్డీవో ఆఫీస్‌లో సమావేశం నిర్వహించారు.
జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 43 మంది ఆరోగ్య సిబ్బందికి పురస్కారాలను అందజేశారు. సాయంత్రం కలెక్టర్ అంకిత్ ఇల్లెందు పట్టణంలో పర్యటించి ప్రభుత్వాస్పత్రి, ట్రైబల్వెల్ఫేర్ స్కూల్, వివిధ వసతి గృహాలను తనిఖీ చేశారు. ట్రైబల్ వెన్ఫెర్ ఆశ్రమ బాలుర పాఠశాలలో పరిశుభ్రత, డైన్‌ను పాటించకపోవడంతో వార్డెన్ భరత్‌ను, ఇల్లెందు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని పరిశీలించి నిర్లక్ష్యం వహించిన వార్డెన్ నరేశ్‌పై సస్పెన్షన్ విధించారు.
