విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : కలెక్టర్ అంకిత్

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం/ బూర్గంపహాడ్/ పాల్వంచ, వెలుగు: విద్యాసంస్థలు, హాస్టళ్లల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, కలుషిత ఆహార ఘటనలు జరిగితే హెచ్ఎంలు, వార్డెన్లు, ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకుంటానని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్ హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో మంగళవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. అనంతరం మణుగూరు మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన కలుషిత ఆహార ఘటనపై అసహనం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు అందజేసే ఆహారం నాణ్యతతో ఉండాలన్నారు. బూర్గంపహాడ్​ తెలంగాణ రెసిడెన్షియల్​ కాలేజ్, కేజీబీవీ స్కూల్​ను కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పాల్వంచ పట్టణంలో నవభారత్​ టీడబ్ల్యూఆర్​ బాలికల గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను తనిఖీ చేస్తూ విద్యార్థుల సామర్థాలను పరిశీలించారు. 

ఇంటర్ పరీక్ష నిర్వహణ పరిశీలన

జనగామ అర్బన్, వెలుగు : ఇంటర్​ పరీక్ష కేంద్రాలను మంగళవారం కలెక్టర్‌‌‌‌ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించారు. ధర్మకంచ ప్రభుత్వ జూనియర్‌‌‌‌ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల సంఖ్య, గైర్హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.