V6 News

పరశురాముడిగా భద్రాద్రి రాముడు

పరశురాముడిగా భద్రాద్రి రాముడు

భద్రాచలం, వెలుగు: శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాల్లో భాగంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారు బుధవారం పరశురాముడి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పగల్ పత్ వేడుకల్లో భాగంగా స్వామి వారిని పరుశురాముడిగా అలంకరించారు.

అంతకుముందు ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీలో పరశురాముడిని ఊరేగించారు. వైకుంఠ ద్వారం ఎదురుగా ఉన్న అధ్యయన వేదికపైకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్న స్వామి వారు. ఆ తర్వాత తిరువీధి సేవకు గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలందుకుని రాజవీధి గుండా తిరిగి ఆలయానికి చేరుకున్నారు.