భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో మార్ట్ ప్రారంభం

భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో మార్ట్ ప్రారంభం

భద్రాచలం/ కామేపల్లి, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్​ను రాష్ట్ర గవర్నర్ శివ్​ప్రతాప్ శుక్లా శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మార్ట్​లో అటవీ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. సహజ సిద్ధమైన ఆర్గానిక్​ వస్తువులతో పాటు, అటవీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ను గవర్నర్ ప్రశంసించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ మార్ట్​ను స్థానికులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్​ అంకిత్, సబ్​ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, ఏపీవో జనరల్ డేవిడ్​రాజ్​ తదితరులు పాల్గొన్నారు. కామేపల్లి మండలం ఉట్కూరుకు చెందిన డాక్టర్​ సామినేని రాఘవులు ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాఘవులు కుటుంబాన్ని పరామర్శించారు. అంతకుముందు ఆయన ఫొటోకు నివాళులర్పించారు.