హీరోగా పుష్ప మూవీ విలన్

హీరోగా పుష్ప మూవీ విలన్

‘పుష్ప’ చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్‌‌గా పోలీస్ ఆఫీసర్‌‌‌‌ పాత్రలో ఇంప్రెస్ చేసిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌‌.. తెలుగులోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లీడ్ రోల్స్ చేస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంటాడు. తాజాగా ఫహాద్ హీరోగా కన్నడ టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ సంస్థ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసింది. ‘ధూమమ్’ టైటిల్‌‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలియజేస్తూ, ఫహాద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఫహద్ నోటికి ప్లాస్టర్ వేసుకొని ఉన్నట్లు డిజైన్ చేసిన పోస్టర్ ఇంటరెస్టింగ్‌‌గా ఉంది.

అలాగే నిప్పు లేకుండా పొగ రాదు అంటూ క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాకు ‘యూ టర్న్‌‌’ ఫేమ్ పవన్‌‌ కుమార్‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌‌ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.