హైదరాబాద్, వెలుగు: ఫైనాన్షియల్టెక్నాలజీ సేవలు అందించే హైదరాబాద్ కంపెనీ వియోనా ఫిన్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) భారత్ బిల్‌పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్ (బీఓయూ)గా సేవలు అందించడానికి అనుమతి సంపాదించింది.
ఈ సర్టిఫికేషన్ వల్ల వియోనా సంస్థ ద్వారా యుటిలిటీలు, విద్య, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవల బిల్లులను చెల్లించడం వీలవుతుంది. వియోనాకు ఇప్పటికే యూపీఐ స్విచ్, ఐఎమ్‌పీఎస్, బ్యాంకింగ్ కనెక్ట్, ఈ–కేవైసీ సేతు వంటి ఎన్సీపీఐ సర్టిఫికేషన్లు ఉన్నాయి. రాబోయే వారాల్లో భాగస్వామ్య బిల్లర్లను చేర్చుకోవడం మొదలు పెడతారు.
