ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు : భట్టి

ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు : భట్టి

రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంపై సీఎల్పీ భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని అన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామంటున్న ప్రభుత్వం కనీసం నాలుగు గంటలు కూడా ఇవ్వడంలేదని వాపోయారు. నాలుగు గంటలైనా కోతలు లేకుండా చూడాలని కోరారు. ఇదే విషయంపై చర్చ కోసం గొంతు పోయేలా అరిచినా స్పీకర్ పట్టించుకోవడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్నా స్పీకర్ కనీసం తమవైపు చూడటం లేదని అందుకే నిరసన తెలిపుతూ సభ నుంచి బయటకు వచ్చామని చెప్పారు.