కొత్త సెక్రటేరియట్ భూమిపూజ.. అంతా రెడీ

కొత్త సెక్రటేరియట్ భూమిపూజ.. అంతా రెడీ

రూ.400 కోట్ల  వ్యయంతో నిర్మించే కొత్త సెక్రటేరియట్ కు గురువారం భూమిపూజ చేయనున్నారు  ముఖ్యమంత్రి కేసీఆర్. ఉదయం 10గంటల 40 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ కు చేరుకుంటారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భూమిపూజ కోసమే కొత్త సెక్రటేరియట్ కు వస్తున్నారు కేసీఆర్. 11 గంటలకు డి-బ్లాక్ ప్రాంతంలో కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణానికి.. ఈశాన్య మూలన శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొంటారు. సెక్రటేరియట్ నిర్మాణంపై హైకోర్టులో కేసు ఉండడంతో తక్కువ మందితో మాత్రమే శంకుస్థాపన చేస్తున్నట్లు సెక్రటేరియట్ అధికారులు తెలిపారు.

కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత.. నేరుగా ఎర్రమంజిల్ కు చేరుకుంటారు ముఖ్యమంత్రి. 12 గంటలకు కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం.. ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రాంగణంలో భూమిపూజ చేయనున్నారు ముఖ్యమంత్రి. 100 కోట్లతో ప్రసుత్తమున్న అసెంబ్లీ మోడల్లోనే కొత్త అసెంబ్లీ నిర్మించనుంది ప్రభుత్వం. భూమిపూజ కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది.  పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారణ జరపనుంది.