ఇది బిగ్‌‌బాస్‌‌-3 సెంటిమెంట్‌‌!

ఇది బిగ్‌‌బాస్‌‌-3 సెంటిమెంట్‌‌!

తాజా ‘బిగ్‌‌బాస్‌‌–3’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సక్సెస్‌‌ఫుల్‌‌గా దూసుకెళ్తోంది. ‘షో’కు సంబంధించిన చాలా అంశాలు సోషల్​ మీడియాలో ఎప్పటికప్పుడు విపరీతంగా ట్రెండ్​ అవుతున్నాయి. రాహుల్–పునర్నవి లవ్‌‌ట్రాక్‌‌తోపాటు సోషల్​ మీడియాలో ట్రెండ్​అవుతున్న మరో విశేషం ‘బిగ్​బాస్‌‌’ సెంటిమెంట్. సినిమాలకు కొన్ని సెంటిమెంట్లు పని  చేసినట్లే ఇప్పుడు ‘బిగ్​బాస్‌‌–3’కి కూడా ఒక సెంటిమెంట్​ పని చేస్తోంది. అదే మొదటిసారి నామినేషన్​ అయినవాళ్లే ఎలిమినేట్‌‌ కావడం. ఈ సీజన్‌‌లో ఇప్పటివరకు ఎలిమినేట్‌‌ అయిన కంటెస్టెంట్ల లిస్టు చూస్తే ఇది నిజమే అనిపించకపోదు. షోలో అందరికంటే ముందుగా ఎలిమినేట్​ అయింది నటి హేమ. నామినేట్​ అయిన మొదటివారమే ఆమె ఎలిమినేట్​ అయింది. ఆ తర్వాత జాఫర్‌‌‌‌, తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, అలీ రెజా, శిల్పా చక్రవర్తి ఎలిమినేట్‌‌ అయ్యారు. వీళ్లంతా ఎలిమినేషన్‌‌ జోన్‌‌కు నామినేట్‌‌ అయిన మొదటి వారమే ఎలిమినేట్‌‌ కావడం విశేషం. రెండువారాల క్రితం హౌజ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన శిల్ప ఫస్ట్‌‌ వీక్‌‌ ఎలిమినేషన్‌‌ జోన్‌‌లో లేదు. రెండోవారం నామినేట్‌‌కాగా, ఆ వారమే ఎలిమినేట్‌‌ అయింది. దీంతో ఈ సెంటిమెంట్‌‌ నిజమే అనిపిస్తుందంటున్నారు నెటిజన్లు.

కలిసిరాని వైల్డ్‌‌కార్డ్‌‌ ఎంట్రీ

హౌజ్‌‌లోకి మధ్యలో ఎంట్రీ ఇచ్చిన తమన్నా, శిల్పా చక్రవర్తి ఎక్కువ రోజులు హౌజ్‌‌లో ఉండలేకపోయారు. తమన్నా మూడు వారాలకు, శిల్ప రెండు వారాలకే ఎలిమినేట్‌‌ అయ్యారు. మధ్యలో ఎంట్రీ ఇవ్వడం వల్ల హౌజ్‌‌మేట్స్‌‌తో కలవలేకపోవడం, హౌజ్‌‌ వాతావరణాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వంటివి వీళ్లకు మైనస్‌‌గా మారుతున్నాయి. వీళ్లను ఆడియెన్స్‌‌ కూడా మిగతా హౌజ్‌‌మేట్స్‌‌లా చూడలేకపోవడం, సడెన్‌‌ ఎంట్రీతో ఓటింగ్‌‌లో వెనకబడటం వల్ల త్వరగానే ఎలిమినేట్‌‌ అవుతున్నారు. ప్రస్తుతం హౌజ్‌‌లో పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మళ్లీ ఒకరో, ఇద్దరో వైల్డ్‌‌కార్డ్‌‌ ఎంట్రీ ఇచ్చే చాన్సుంది.

Big boss 3 Sentiment: The first nominee is Eliminate