గ్యాస్ కష్టాలకు చెక్: మొదటిసారి కరెంట్ స్టవ్ వాడుతున్నారా ? ఈజీగా ఎలా వాడాలో తెలుసుకోండి..

గ్యాస్ కష్టాలకు చెక్: మొదటిసారి కరెంట్ స్టవ్ వాడుతున్నారా ? ఈజీగా ఎలా వాడాలో తెలుసుకోండి..

మన దేశంలో కొనసాగుతున్న ఎల్‌పిజి గ్యాస్ సంక్షోభం ఎక్కువగా సామాన్యుడి పై ప్రభావం చూపిస్తుంది.  గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల చాలామంది ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ అంటే కరెంట్ స్టవ్ వాడటం మొదలుపెడుతున్నారు. మీరు మొదటిసారి ఇండక్షన్ స్టవ్ వాడుతున్నట్లయితే, ఈ చిన్న సేఫ్టీ చిట్కాలు పాటిస్తే వంట చేయడం చాలా సేఫ్, ఈజీ అవుతుంది. 

ఇండక్షన్ స్టవ్ వాడటం ఎలా అంటే... స్టవ్‌ను ఎప్పుడూ సమానంగా ఉండే గట్టి నేల మీద లేదా టేబుల్ మీద పెట్టాలి. వంగి ఉన్న  చోట పెడితే గిన్నెలు జారిపోయే ప్రమాదం ఉంటుంది. ముందుగా స్టవ్ వైరును ప్లగ్ పాయింట్‌కు దగ్గలో పెట్టి కనెక్ట్ చేయండి. పవర్ సాకెట్ లూజ్ లేకుండా చూసుకోండి, దీనివల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది.

స్టవ్ మీద వంట గిన్నె పెట్టిన తర్వాతే స్విచ్ ఆన్ చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండక్షన్  స్టవ్ మీద కేవలం దానికి సరిపడే గిన్నెలను మాత్రమే వాడాలి. మామూలు అల్యూమినియం గిన్నెలు దీని మీద పనిచేయవు.

స్టవ్ ఆన్ చేశాక, మీరు చేసే వంటను బట్టి అంటే ఉదాహరణకు: పాలు వేడి చేయడం, వంటలు చేయడం, దోశలు  వేయడం వంటి వాటి  కోసం అక్కడ ఇచ్చిన బటన్లను సెలెక్ట్ చేసుకొని నొక్కండి. చాలా స్టవ్‌లలో దేనికి ఎంత వేడి ఉండాలో ముందే సెట్ చేసి ఉంటుంది. 

గ్యాస్ స్టవ్ కంటే ఇండక్షన్ స్టవ్ మీద వంట చాలా త్వరగా అవుతుంది. కాబట్టి వంటను మధ్య మధ్యలో గమనిస్తూ ఉండండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది.

Also Read : నెగెటివిటీని తట్టుకోవడం ఎలా?

వంట అయిపోగానే స్టవ్ స్విచ్ ఆఫ్ చేయండి. కానీ వెంటనే మెయిన్ ప్లగ్ తీసేయకండి. ఎందుకంటే స్టవ్ లోపల ఉన్న ఫ్యాన్ తిరుగుతూ వేడిని తగ్గిస్తుంది. అది ఆగిపోయిన తర్వాతే ప్లగ్ తీయండి.

ఇప్పుడు స్టవ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మెత్తటి గుడ్డతో స్టవ్ పైన ఉన్న గాజు భాగాన్ని తుడవండి. దీనివల్ల స్టవ్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అయితే  ఖాళీ గిన్నె స్టవ్ మీద పెట్టి ఎప్పుడూ  స్విచ్ ఆన్ చేయకండి. గిన్నెలో నీళ్లు లేదా నూనె వేసిన తర్వాతే స్టవ్ ఆన్ చేయడం మంచిది.