సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారాన్ని అందించింది. సీబీఎస్ఈ ఫలితాల తేదీ పై విద్యార్థుల్లో ఆందోళనలు తొలగిస్తూ క్లారిటీ ఇచ్చింది. 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 14వ తేదీలోపు వచ్చే అవకాశం ఉండగా.. 12వ తరగతి ఫలితాలు 10వ తరగతి రిజల్ట్స్ వచ్చిన కొద్ది రోజుల తర్వాత విడుదల చేయనుంది. మే నెలలో రెండోసారి బోర్డు పరీక్షలు ఉండటం వల్ల, ఈసారి ఫలితాలను వీలైనంత త్వరగా అంటే ఏప్రిల్ మధ్యలోనే విడుదల చేయాలని సీబీఎస్ఈ భావిస్తోంది.
గత ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం ప్రకారం.. మార్కులు తక్కువ వచ్చిన వారు లేదా ఫెయిల్ అయిన వారు మే నెలలో జరిగే రెండో విడత పరీక్షలు రాసుకోవచ్చు. దీని ద్వారా గరిష్టంగా మూడు సబ్జెక్టులలో మార్కులను పెంచుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
10వ, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 17న మొదలయ్యాయి. అయితే 10వ తరగతి పరీక్షలు మార్చి 11న పూర్తి కాగా.. 12వ తరగతి పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతుండగా ఏప్రిల్ 10తో ముగుస్తాయి.
సీబీఎస్ఈ ఫలితాలు ఎలా చూసుకోవాలంటే
ఈ అధికారిక వెబ్‌సైట్లలో మీ హాల్ టికెట్ నంబర్ ద్వారా రిజల్ట్స్ చూడవచ్చు:
*cbse.gov.in
*results.cbse.nic.in
*results.digilocker.gov.in
*umang.gov.in
వెబ్‌సైట్లలో మాత్రమే కాకుండా, మీ మొబైల్‌లో డిజిలాకర్ లేదా ఉమాంగ్ యాప్స్ ద్వారా కూడా మార్కుల లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
