సందడిగా బిగ్ బాస్ సీజన్-6 గ్రాండ్ ఫినాలే

సందడిగా బిగ్ బాస్ సీజన్-6 గ్రాండ్ ఫినాలే

బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ - 6 కాసేపట్లో ముగియనుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ‘స్టార్ మా’ ఛానల్లో అట్టహాసంగా జరుగుతోంది. హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో ఎంట్రీ ఇవ్వగా.. హుషారైన డ్యాన్స్ లతో సందడిగా మారిపోయింది. నాగార్జున బ్లూ డ్రెస్‌లో గ్రాండ్‌గా కనిపించారు. కమల్‌ హాసన్‌ హిట్ మూవీ ‘విక్రమ్‌’ మూవీలోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ ఆయన వచ్చారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న న్యూ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ లోని బాస్‌ పార్టీ` సాంగ్‌ కి అదిరిపోయే స్టెప్పులేశారు. 

అయితే ఈ షోలో ఎవరు విజేతగా నిలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్లు (రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్‌) ఉన్నారు. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో పలువురు తారలు సందడి చేస్తున్నారు. ఎలిమినేట్ అయిన 16 మంది కంటెస్టెంట్లు కూడా ఫినాలే ఈవెంట్ కు విచ్చేశారు. మరి విజేత ఎవరో కాసేపట్లో తేలిపోనుంది.