
బిగ్ బాస్ సీజన్ 7లో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీల,దామిని హౌస్ నుండి ఎలిమినేట్ అవగా.. నాలుగో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు రతిక. అవును ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అందరికన్నా రతిక ఓటింగ్ చాలా తక్కువగా ఉంది.
ఎవరు డేంజర్ జోన్ ఉన్నారు?
నాలుగోవారం ఓటింగ్ లో శుభ శ్రీ, తేజ, రతిక. డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురికి ఓటింగ్ పర్సెన్టేజ్ లో లీస్ట్ లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో శుభ శ్రీకి కాస్త బెటర్ ఓటింగ్ జరిగిందనే చెప్పాలి. ఇక మిగిలింది తేజ అండ్ రతిక. ఈ ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే తేజ వల్ల ఇంట్లో కాస్త ఫన్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ అతనివైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read :- ఒక్కపాట కోసం ఇద్దరు రైటర్స్.. గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఛాన్స్ ఎవరికీ?
ఎలిమినేట్ అయ్యేది ఎవరు.. రతికనా? తేజనా?
నిజానికి ఈ వారం తేజ ఎలిమినేట్ అవ్వాలి. ముందు నుండి టాస్కుల్లో అతని పర్ఫార్మెన్స్ బాగలేదని చాలా మంది హౌస్ మేట్స్ నామినేట్ చేశారు. కానీ గత బివారం హౌస్ లో రతిక బిహేవియర్ అస్సలు బాగోలేదు. ప్రశాంత్ ను టార్గెట్ చేయడం వాళ్ళ ఆమె బయట చాలా నెగిటీవ్ ఏర్పడింది. మంగళ వారం వరుకు కూడా ఆమెకు ఓటింగ్ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే.. నువ్వేడవిరా నన్ను అలా అనుకోవడానికి అని రతిక ప్రశాంత్ పై రెచ్చిపోవడంతో ఆమెను టార్గెట్ చేశారు. అంతేకాదు అతన్ని క్రయింగ్ స్టార్ అవడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం వంటిని ఆమెకు నెగిటీవ్ గా మారాయి. ఆమెను బయటకు పంపాలని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. దీంతో ఆమెకు పడాల్సిన ఓట్లన్నీ తేజకు పడ్డాయని సమాచారం. దీంతో తేజ సేఫ్ అయ్యి రతిక ఎలిమినేట్ కానుంది.
తేజ చేసిన తప్పేంటి?
అయితే ఇక్కడ తేజ చేసిన తప్ప గురించి కూడా మాట్లాడుకోవాలి. టాస్క్ లో భాగంగా తేజ గౌతమ్ తో చాలా దారుణంగా బిహేవ్ చేశాడు. గౌతమ్ మెడకు తాడు వేసి లాగడం చాలా దారుణంగా అనిపించింది. ఆడియన్స్ కూడా తేజ ప్రవర్తనకు అవాక్కయ్యారు. ఫిజికల్ అటాక్ కాబట్టి ఈ కారణాన్ని చూపించి తేజను డైరెక్ట్ గా బయటకు పంపే అవకాశం ఉంది. కాబట్టి ఓట్స్ పరంగా చూసుకుంటే రతిక, బిహేవియర్ పరంగా చూసుకుంటే తేజ ఈవారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.