
బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొత్తం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 2025, నవంబర్ 6వ తేదీ మొదటి విడత, నవంబర్ 11వ తేదీ రెండో విడత పోలింగ్ నిర్వహిస్తుండగా.. నవంబర్ 14వ తేదీ ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించనున్నారు.
షెడ్యూల్ ఇదే :
మొదటి విడత పోలింగ్ : నవంబర్ 6వ తేదీ, 2025
రెండో విడత పోలింగ్ : నవంబర్ 11వ తేదీ, 2025
కౌంటింగ్ తేదీ : నవంబర్ 14వ తేదీ, 2025
బీహార్ మొత్తం ఓటర్లు 7 కోట్ల 43 లక్షలు. ఇందులో పురుష ఓటర్లు పురుష ఓట్లు 3 కోట్ల 92 లక్షల మంది ఉండగా.. మహిళా ఓటర్లు 3 కోట్ల 50 లక్షల మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు ఒక వెయ్యి 725 మంది ఉన్నారు.
బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 నియోజకవర్గాల్లో జనరల్ సీట్లు 203గా ప్రకటించింది ఈసీ.
ఇందులో ఎస్సీ కేటగిరీ నియోజకవర్గాలు 38 ఉండగా.. ఎస్టీ నియోజకవర్గాలు 2 ఉన్నాయి.
బీహార్ లో మొత్తం పోలింగ్ కేంద్రాలు 90 వేల 712 ఏర్పాటు చేస్తుండగా.. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సరాసరి ఓట్లు 818గా కేటాయించింది ఈసీ. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ బూత్ లు 13 వేల 911 ఏర్పాటు చేస్తుండగా.. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో పోలింగ్ బూతులు 76 వేల 801 ఏర్పాటు చేస్తుంది.
అన్ని పోలింగ్ కేంద్రాలను.. 100 శాతం వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నామని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది ఈసీ.