టెర్రరిజమ్ వ్యాప్తి కేసులో బిహార్ మదర్సా నిర్వాహకుడి అరెస్ట్

టెర్రరిజమ్ వ్యాప్తి కేసులో బిహార్ మదర్సా నిర్వాహకుడి అరెస్ట్

భోపాల్: టెర్రరిజాన్ని వ్యాప్తిచేస్తున్నారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్.. బిహార్‌‌‌‌‌‌‌‌లో మదర్సా నిర్వహిస్తున్న ఇజ్రార్ ఉల్ హక్ (56) అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బిహార్ ఏటీఎస్.. స్థానిక పోలీసుల సాయంతో సోమవారం మధుబని జిల్లాలో ఇజ్రార్ ఉల్ హక్ ను అదుపులోకి తీసుకున్నారు. మధుబని కోర్టు అనుమతితో నిందితుడిని ట్రాన్సిట్ రిమాండ్‌‌‌‌‌‌‌‌పై మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు తరలించనున్నారు.

అయితే, ఈ ముఠాకు కింగ్‌‌‌‌‌‌‌‌పిన్  ఇతడా.. కాదా.. అనేది విచారణ తర్వాతే తేలుతుందని అధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో తొలి అరెస్టు ఈ నెల 12న జరిగింది. భోపాల్‌‌‌‌‌‌‌‌లోని ఖాజీ క్యాంప్ ప్రాంతంలో మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్ నివాసి అయిన మహ్మద్ ఫరాజ్(35)ను పట్టుకున్నారు. అతని సమాచారంతో టెర్రర్​ ​గ్యాంగ్​లతో సంబంధం కలిగి ఉన్నారనే 
ఆరోపణలపై మరో ఇద్దరిని అరెస్టు చేశారు.