సర్కార్ టీచర్లు ఆ పని చేస్తే చర్యలు తప్పవు.. ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు

సర్కార్ టీచర్లు ఆ పని చేస్తే చర్యలు తప్పవు.. ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు

ప్రైవేట్ ట్యూషన్లు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ విద్యాశాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులు తమ సాధారణ పాఠశాల విధులతో పాటు ప్రైవేట్ ట్యూషన్‌లు చెబుతున్నారనే ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నారు. ఈ నిర్ణయాత్మక చర్యల్లో భాగంగా విద్యాశాఖ.. జిల్లా మేజిస్ట్రేట్‌లకు రాసిన లేఖ రాసింది. ఉపాధ్యాయుల నుంచి, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నుంచి రాత పూర్వక ఒప్పందాలపై సంతకాలు తీసుకోవాలని ఆదేశించింది.

ఈ ఒప్పందాలను ఉపాధ్యాయులు ఉల్లంఘిస్తే.. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లపై కఠినమైన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నట్టు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అలాంటి ఉపాధ్యాయుల వివరాలను వెంటనే ప్రధాన కార్యాలయానికి అందించాలని విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించింది.

బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (BSEB) ప్రాక్టికల్, థియరీ పరీక్షలు 10, 12 తరగతులకు జనవరి 10న ప్రారంభం కానున్నాయి, పరీక్షా కాలంలో ఉపాధ్యాయులందరూ తమ కేటాయించిన పాఠశాలల్లో ఉండేలా చూడాలని విద్యాశాఖ.. లేఖలో అధికారులను కోరింది. బోర్డు పరీక్షల సమయంలో సెలవులను పరిమితం చేయడాన్ని ఈ ఆదేశం నొక్కి చెబుతుంది, పాఠశాలలోని మొత్తం ఉపాధ్యాయులలో 10 శాతం కంటే ఎక్కువ మంది ఏకకాలంలో సెలవుల్లో ఉండకూడదని కూడా ఆదేశించింది.