భారత మార్కెట్లో దూసుకుపోతున్న బిల్ పే

భారత మార్కెట్లో దూసుకుపోతున్న బిల్ పే
  • ఇప్పటికే వేల మది బిల్లర్స్ చేరిక
  • చిన్న షాపులూ వాడుకోవచ్చు

న్యూఢిల్లీ: నేషనల్‌‌ పేమెంట్స్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎన్సీపీఐ) 2016లో తీసుకొచ్చిన యూపీఐ సూపర్‌‌హిట్ అయింది. ఇప్పటి వరకు 2,300 కోట్ల బిల్లింగ్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌ జరగడమే ఇందుకు నిదర్శనం. ఇదే సంస్థ 2017లో లాంచ్ చేసిన భారత్‌‌ బిల్‌‌ పేమెంట్‌‌ సిస్టమ్‌‌ (బీబీపీఎస్‌‌) కూడా వేగంగా దూసుకుపోతున్నది. రాబోయే కొన్నేళ్లలో ఇది మరిన్ని విజయాలు సాధిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇది వరకే 20 వేల మంది బిల్లర్స్‌‌ బీబీపీఎస్‌‌లో చేరారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ బోర్డులు, నీటి సరఫరా సంస్థలు, డీటీహెచ్‌‌ ఆపరేటర్లు, గ్యాస్‌‌ కంపెనీల వంటివి ఉన్నాయి. ఇప్పటి వరకు 10 వేల ఎడ్యుకేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌ బీబీపీఎస్‌‌ ద్వారా పేమెంట్స్‌‌ను అంగీకరిస్తున్నాయి. ఇన్సూరెన్స్‌‌, క్రెడిట్‌‌కార్డ్‌‌ బిల్స్‌‌, లోన్ ఈఎంఐలను, మున్సిపల్‌‌ ట్యాక్సులను ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ ద్వారా చెల్లించవచ్చు. దీని ప్రత్యేక ఏమిటంటే ఇది బిజినెస్‌‌ టూ బిజినెస్‌‌ (బీ2బీ)తోపాటు బిజినెస్‌‌ టూ కన్జూమర్‌‌ (బీ2సీ) సేవలనూ అందిస్తుంది. అందుకే దీని ట్రాన్సాక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి. గత డిసెంబరు 2.9 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగితే, 2019 డిసెంబరులో 1.5 కోట్ల వరకు ట్రాన్సాక్షన్లు జరిగాయి. ట్రాన్సాక్షన్ల విలువ రూ.3,900 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఆన్‌‌లైన్‌‌ యుటిలిటీ పేమెంట్స్‌‌లో బీబీపీఎస్‌‌ వాటా 66 శాతానికి చేరింది. 80 శాతం బీబీపీఎస్‌‌ ట్రాన్సాక్షన్లు మొబైల్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ ద్వారానే జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్‌‌ కంప్లైంట్‌‌/ఫెయిల్యూర్‌‌ రేటు -0.05 శాతం కంటే తక్కువ.

బీబీపీఎస్‌‌ స్పెషాలిటీ ఏమిటంటే..

బీబీపీఎస్‌‌లో చేరడానికి యుటిలిటీ కంపెనీ కొత్త సాఫ్ట్‌‌వేర్‌‌ను ఇన్‌‌స్టాల్‌‌ చేయాల్సిన అవరం లేదు. ప్రస్తుతం ఉన్న ఇన్‌‌ఫ్రా ద్వారానే బీబీపీఎస్‌‌కు మారవచ్చు. ఇందుకోసం పెద్దగా ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ కూడా అవసరం ఉండదు. అన్ని రకాల కంపెనీలకు తగిన అప్లికేషన్‌‌ ప్రోగ్రామింగ్‌‌ ఇంటర్‌‌ఫేస్‌‌లను (ఏపీఐలను) ఎన్సీపీఐ డెవలప్‌‌ చేసింది. దీనివల్ల బీబీపీఎస్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌కు ఇంటిగ్రేట్‌‌ కావడం చాలా సులువు. గూగుల్‌‌ పే, పేటీఎం వంటి యాప్స్‌‌ ద్వారా కూడా బీబీపీఎస్‌‌ను వాడుకోవచ్చు. ‘‘బీబీపీఎస్‌‌తో బిల్లింగ్‌‌ చాలా ఈజీ అవుతుంది. బిల్లర్లు కొత్త కేటగిరీలకు తగిన ఐటీ ఇన్‌‌ఫ్రాను కూడా డెవలప్‌‌ చేసుకుంటున్నారు. కిరాణా షాపుల యజమానులు స్మార్ట్‌‌ఫోన్‌‌ ద్వారానే ట్రాన్సాక్షన్‌‌ చేసుకోవచ్చు’’ అని బీబీపీఎస్‌‌ చీఫ్‌‌ ఏఆర్‌‌ రమేశ్‌‌ అన్నారు. ఎన్సీపీఐ బిల్లర్ల నుంచి కమీషన్‌‌ తీసుకోవడం లేదని, తమది లాభం కోసం పనిచేసే సంస్థ కాదని చెప్పారు. డిజిటల్ పేమెంట్స్‌‌ ఖర్చును విపరీతంగా తగ్గించడం, కస్టమర్లను క్యాష్‌‌లెస్‌‌ ట్రాన్సాక్షన్లవైపుకు మళ్లించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.

ఇది ఎలా పనిచేస్తుందంటే ?

బీబీ పేమెంట్‌‌ ఆపరేటింగ్‌‌ యూనిట్‌‌ (బీబీపీఓయూ) కన్జూమర్ల అకౌంట్లకు, బిల్లర్ల అకౌంట్లకు కనెక్ట్‌‌ అయి ఉంటుంది. బిల్లర్‌‌ ఆపరేటింగ్‌‌ యూనిట్‌‌ (బ్యాంకులు) నుంచి కస్టమర్‌‌ ఏదైనా యాప్‌‌ ద్వారా డబ్బు చెల్లించేందుకు సాయపడుతుంది. షాపులు కూడా బీబీపీసీయూకు కనెక్ట్‌‌ కావడం ద్వారా డబ్బు చెల్లించవచ్చు. అయితే బీబీపీఎస్‌‌ బిల్లింగ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ను ఉపయోగించుకోవడానికి బిల్లర్‌‌ కంపెనీలకు ఆర్‌‌బీఐ అనుమతి తప్పనిసరి. ఉదాహరణకు కేరళ స్టేట్‌‌ ఎలక్ట్రిసిటీ బోర్డు బిల్లర్‌‌. దీనికి పేటీఎం బిల్లర్‌‌ ఆపరేటింగ్‌‌ యూనిట్‌‌గా పనిచేస్తుంది. కస్టమర్‌‌ గూగుల్‌‌ పే/ఫోన్‌‌ ద్వారా చెల్లించిన డబ్బును బీబీపీఎస్‌‌ ద్వారా  బోర్డుకు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేస్తుంది. పేటీఎంకు బదులు బ్యాంకులను కూడా బిల్లర్లు ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్‌‌కు బోర్డు పేటీఎంకు రూ.1.75 చొప్పున కమీషన్ ఇస్తుంది. అయితే బీబీపీఎస్‌‌  వచ్చాక తమ బిజినెస్‌‌లు దెబ్బతిన్నాయని   ఇతర బిల్లింగ్​ కంపెనీలు అంటున్నాయి. ఉదాహరణకు ఒక క్రెడిట్‌‌ ఈఐఎంని వసూలు చేస్తే రెండు శాతం కమీషన్ వస్తుందని, బీబీపీఎస్‌‌లో అయితే జీరో కమీషన్ ఉంటుందని చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

68 ఏండ్లు జైల్లోనే: 83 ఏండ్ల వయసులో బయటికొచ్చిండు

చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు

బెల్లంపల్లిలో మరో ల్యాండ్​ స్కామ్