పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు చెల్లించాలి: ఎమ్మెల్యే కూనంనేని

పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు చెల్లించాలి: ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రికొత్తగూడెం/ పాల్వంచ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించని వారి నుంచి నాట్ విల్లింగ్ పత్రాలు తీసుకోవాలని, పూర్తైన ఇండ్లకు బిల్లులు చెల్లించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులకు సూచించారు.

భద్రాద్రికొత్తగూడెం జిల్లా  కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో గృహ నిర్మాణ శాఖాధికారులతో బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్ కలిసి మాట్లాడారు.

మొదటి విడతలో మిగిలిపోయిన 199 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వంచ పట్టణంలో వివిధ డివిజన్లలో పర్యటించారు. రోడ్లపై మిషన్​ భగీరథ పైప్​లైన్ల పేరిటి గుంతలు తీసి వదిలేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.