బీజేపీ ఓటమికి హామీలు నెరవేర్చక పోవడమే: ఖర్గే

బీజేపీ ఓటమికి హామీలు నెరవేర్చక పోవడమే: ఖర్గే

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, జేఎంఎం నేతృత్వంలోని యూపీఏ కూటమికి మెజారిటీ వస్తుండటంతో…కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్జే  స్పందించారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే ప్రజలు ఇచ్చే తీర్పు ఇలాగే ఉంటుందంటూ బీజేపీని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలు, పెద్ద పెద్ద వాగ్దానాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడం మా బాధ్యత. బీజేపీ మాత్రం మేము తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా అమలు చేస్తున్నామని  చెబుతోందని ఆరోపించారు. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు విజయవంతమయ్యాయా? 15 లక్షల ఉద్యోగాలంటూ ఇచ్చిన హామీ ఏమైంది అంటూ ఖర్గే  ప్రశ్నించారు.. రైతులు.. బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారని, ఇచ్చిన హామీలు నిలుపుకోని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పితీరుతారని ఆయన స్పష్టం చేశారు.