వరుస రౌండ్లలో బీజేపీ ఆధిక్యం.. ఏడో రౌండ్‌లోనూ..

వరుస రౌండ్లలో బీజేపీ ఆధిక్యం.. ఏడో రౌండ్‌లోనూ..

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ దూకుడును ప్రదర్శిస్తోంది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యాన్ని పెంచుకుంటున్న కమలం పార్టీ.. ఏడో రౌండ్‌లోనూ హవా ప్రదర్శించింది. ఏడో రౌండులో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఏడో  రౌండ్ లెక్కింపులో ఈటలకు 4,038 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3,792 ఓట్లు, కాంగ్రెస్‎కు 94 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండులో బీజేపీ 246 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఏడు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 31,021 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 27,589 ఓట్లు, కాంగ్రెస్‎కు 1,086 ఓట్లు నమోదయ్యాయి. ఏడు రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3432 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

ఏడో రౌండ్

బీజేపీ 4,038
టీఆర్ఎస్ 3,792
కాంగ్రెస్ 1,086
బీజేపీ లీడ్ 246

ఆరులోనూ బీజేపీదే ఆధిక్యం

ఆరో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4656 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3639 ఓట్లు, కాంగ్రెస్‎కు 180 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండులో బీజేపీ 1017 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఆరు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 26,983 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 23,797 ఓట్లు, కాంగ్రెస్‎కు 992 ఓట్లు నమోదయ్యాయి. ఆరు రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3,186 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

ఆరో రౌండ్

బీజేపీ 4656
టీఆర్ఎస్ 3639
కాంగ్రెస్ 180
బీజేపీ లీడ్ 1017

తగ్గని బీజేపీ దూకుడు

ఐదు రౌండులో కూడా బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐదో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4358 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4014 ఓట్లు, కాంగ్రెస్‎కు 132 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండులో బీజేపీ 344 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఐదు రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 22,327 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 20,158 ఓట్లు, కాంగ్రెస్‎కు 812 ఓట్లు నమోదయ్యాయి. ఐదు రౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2,169 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

ఐదో రౌండ్

బీజేపీ 4358
టీఆర్ఎస్ 4014
కాంగ్రెస్ 132
బీజేపీ లీడ్ 344

నాలుగో రౌండ్‌‌‎లోనూ తగ్గని బీజేపీ జోరు

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలలో బీజేపీ మొదటినుంచి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. నాలుగో రౌండ్ లెక్కింపులో ఈటలకు 4444 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3882 ఓట్లు, కాంగ్రెస్‎కు 234 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండులో బీజేపీ 562 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. నాలుగురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 17,969 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు నాలుగురౌండ్లలో కలిపి 16,144 ఓట్లు లభించాయి. కాంగ్రెస్‎కు నాలుగురౌండ్లలోనూ కలిపి 680 ఓట్లు నమోదయ్యాయి. నాలుగురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1825 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.

నాలుగో రౌండ్

బీజేపీ 4444
టీఆర్ఎస్ 3882
కాంగ్రెస్ 234
బీజేపీ లీడ్ 562

మూడో రౌండ్‎లోనూ బీజేపీదే ఆధిక్యం

హుజురాబాద్ పట్టణంలో కూడా బీజేపీ ముందంజలో ఉంది. ఉపఎన్నిక సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావులు  ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అయినా కూడా పట్టణంలో మూడోరౌండు ముగిసేసరికి బీజేపీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మూడోరౌండ్ లెక్కింపులో ఈటలకు 4064 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 3159 ఓట్లు, కాంగ్రెస్‎కు 107 ఓట్లు వచ్చాయి. మూడోరౌండులో బీజేపీ 905 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. మూడురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 13,525 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు మూడురౌండ్లలో కలిపి 12,262 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ కు మూడురౌండ్లలోనూ కలిపి 446 ఓట్లు నమోదయ్యాయి. మూడురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1263 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

మూడో రౌండ్

బీజేపీ 4064
టీఆర్ఎస్ 3159
కాంగ్రెస్ 107
బీజేపీ లీడ్ 1263 

రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీదే ఆధిక్యం

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ముందంజలో ఉంది. రెండోరౌండ్ లెక్కింపులో ఈటలకు 4851 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‎కు 4659 ఓట్లు, కాంగ్రెస్‎కు 220 ఓట్లు వచ్చాయి. రెండోరౌండులో బీజేపీ 192 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 9461 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు రెండురౌండ్లలో కలిపి 9103 ఓట్లు లభించాయి. రెండురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి 358 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. 

రెండో రౌండ్

బీజేపీ 4851
టీఆర్ఎస్ 4659
కాంగ్రెస్ 220
బీజేపీ లీడ్ 192

తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం

హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ బోణీ కొట్టింది. హుజురాబాద్ మండలానికి చెందిన ఈవీఎంల లెక్కింపులో ఈటలకు 4610 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్ కు 4444 ఓట్లు, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి. తొలిరౌండులో బీజేపీకి 166 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది.

తొలి రౌండ్

బీజేపీ 4610
టీఆర్ఎస్ 4444
కాంగ్రెస్ 119
బీజేపీ లీడ్ 166
నోటా 51