అమ్మాయిలే టాప్... ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల సత్తా...

అమ్మాయిలే టాప్... ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల సత్తా...
  • ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాల్లో ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిల సత్తా

వెలుగు, నెట్​వర్క్​ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో మళ్లీ బాలికలు తమ సత్తా చాటారు. ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాల పరిధిలోని అన్ని జిల్లాల్లోనూ బాలికలు ఉత్తీర్ణతలో ముందంజలో నిలిచారు. ఆదివారం విడుదలైన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరల్, వొకేషనల్ ఫలితాల్లో బాలురు వెనుకబడ్డారు.  నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో 38 శాతం మంది బాలురే పాస్​ అయ్యారు. 

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలో 72.65 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ విభాగంలో 8,982 మంది పరీక్షలు రాయగా 5,586 మంది (62.19%) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 4,862 మందికి 3,546 మంది ( 73%), బాలురు 4,120 మందికి 2,040 మంది మాత్రమే పాస్ అయ్యారు. వొకేషనల్ ఫస్ట్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,877 మంది హాజరై 1,244 మంది (66.28%) పాస్ అయ్యారు. బాలికలు 1,032 మందికి గాను 837 మంది, బాలురు 845 మందికి గాను 407 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ రెగ్యులర్ లో 8,116 మంది హాజరై 5,896 మంది (72.65%) పాస్ అయ్యారు. బాలికలు 4,505 మందికి 3,641 మంది, బాలురు 3,611 మందికి 2,255 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ సెకండ్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,740 మంది హాజరై 1,432 మంది (82.30%) పాస్ అయ్యారు. బాలికలు 1,000 మందికి 907 మంది, బాలురు 740 మందికి గాను 525 మంది ఉత్తీర్ణులయ్యారు. 

నారాయణపేట జిల్లాలో 3,893 మంది హాజరై 2,188 మంది (56.20%) పాస్ అయ్యారు. బాలికలు 2,270 మందికి 1,537 మంది, బాలురు 1,623 మందికి 651 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ ఫస్ట్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 502 మంది హాజరై 343 మంది (68.33%) పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,239 మంది హాజరై 2,264 మంది (69.90%) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1,927 మందికి 1,511 మంది, బాలురు 1,312 మందికి 753 మంది పాస్ అయ్యారు. వొకేషనల్ సెకండ్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 86.43 శాతం ఉత్తీర్ణత సాధించారు.

వనపర్తి జిల్లాలో ఫలితాలు నిరాశ పరిచాయి. ఫస్ట్ ఇయర్ 58.27 శాతం, సెకండ్ ఇయర్ 71 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 66 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానం దక్కింది. గద్వాల జిల్లా ఫస్ట్ ఇయర్ లో 62.06 శాతంతో 18వ స్థానం, సెకండ్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 73.01 శాతంతో 14వ స్థానం సాధించింది.

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాలికల ఉత్తీర్ణత 66 శాతం కాగా బాలురు 38 శాతం మాత్రమే సాధించారు. సెకండ్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాలికలు 75 శాతం, బాలురు 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా ఫస్ట్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 27వ, సెకండ్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 28వ స్థానాల్లో నిలిచింది. 

ఉమ్మడి మెదక్ జిల్లా.. 

సంగారెడ్డి జిల్లాలో ఫస్ట్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాలికలు 70.82 శాతం, బాలురు 49.44 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాలికలు 78.01 శాతం, బాలురు 61.35 శాతం పాస్ అయ్యారు. మెదక్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ బాలికలు 61.54 శాతం, బాలురు 46.99 శాతం, సెకండ్​ ఇయర్ బాలికలు 75.34 శాతం, బాలురు 58.90 శాతం ఉత్తీర్ణత సాధించారు. సిద్దిపేట జిల్లాలో ఫస్ట్ ఇయర్ బాలికలు 64.15 శాతం, బాలురు 38.85 శాతం; సెకండ్ ఇయర్ బాలికలు 72.36 శాతం, బాలురు 51.29 శాతం ఉత్తీర్ణతతో రాణించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో .. 

నల్గొండ జిల్లాలో ఇంటర్ ఫలితాలలో జనరల్ విభాగంలో మొదటి సంవత్సరంలో 11281 మంది విద్యార్దులు పరీక్షలు రాయగా 7086 మంది(62.81) మంది పాస్ అయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 11030 మంది పరీక్షలు రాయగా 8128 మంది(73.68)పాస్ అయ్యారు. ఒకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విభాగంలో ద్వితీయ సంవత్సరంలో 1905 మంది పరీక్ష రాయగా 1294(67.93)మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరంలో 1834 మంది పరీక్ష రాయగా 1004 మంది(54.74)మంది పాస్ అయ్యారు. 

సూర్యాపేట జిల్లాలో .. 

మొదటి సంవత్సరంలో బాలికలు 70.69శాతం ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 78.11శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 8184 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4955 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 60.54శాతం మంది విద్యార్థులు పాసై రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలో నిచిలింది. ద్వితీయ సంవత్సరంలో 7468 మంది విద్యార్థులకు 5174 మంది విద్యార్థులు పాసై 69.28 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 23వ స్థానంలో నిలిచింది. 

యాదాద్రి జిల్లాలో 

యాదాద్రి జిల్లా గతం కంటే మంచి ఫలితాలు సాధించింది. ఈసారి స్టేట్ లో 16 శాతంలో నిలిచింది.2025-26 ఎడ్యుకేషన్ ఇయర్ లో 12,332 మంది పరీక్షలు రాయగా 7973(64.65 శాతం) మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ లో జనరల్ స్టూడెంట్స్ 5178 మంది రాయగా 3124 (60.33 శాతం) మంది పాస్ అయ్యారు. ఒకేషనల్ స్టూడెంట్స్ 1373 మంది రాయగా 681 మంది (49.6) పాస్ అయ్యారు.సెకండ్ ఇయర్ లో జనరల్ 4457 మంది రాయగా వీరిలో 3253 మంది (72.49 శాతం) పాస్ అయ్యారు. ఒకేషనల్ 1324 మంది రాయగా 915 మంది (69.11 శాతం) పాస్ అయ్యారు.