కొణిజర్ల, వెలుగు : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని లాలాపురానికి చెందిన నామ శ్రీనివాసరావు శనివారం వరి సాగును కోతుల బెడద నుంచి రక్షించుకునే క్రమంలో ప్రమాదశాత్తు రేకుల షెడ్ లో పడిపోయి మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదివారం శ్రీనివాసరావు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
