అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం ‘డెకాయిట్’. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని మేకర్స్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు దర్శకులు నాగ్ అశ్విన్, నందినీ రెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, స్వప్నాదత్ అతిథులుగా హాజరై టీమ్‌ను అభినందించారు. అడివి శేష్ మాట్లాడుతూ ‘నా బిగ్గెస్ట్ ఓపెనర్ ఇది. జీవితంలో ఉన్న చిన్న విషయాలతో ఈ కథను అల్లడం జరిగింది.
మనకు జీవితంలో చిన్న చిన్న విషయాలే గుర్తుంటాయి. ఈ ప్రేమ కథలో కూడా అలా గుర్తుండిపోయే సన్నివేశాలు ఉన్నాయి. నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవడం ఆనందంగా ఉంది’ అన్నాడు. తాను గర్వపడే సినిమా ఇదని మృణాల్ ఠాకూర్ చెప్పింది. ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ ‘ఇది ప్రేమతో చేసిన సినిమా. ప్యూర్ లవ్‌కు ఒక ఎక్స్‌ప్రెషన్. ఈ కథకు ప్రాణం పోసిన అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
