రూ.80 వేల కోట్లు ఖర్చుచేసి ఎకరాకు నీళ్లివ్వలే: దత్తాత్రేయ

రూ.80 వేల కోట్లు ఖర్చుచేసి ఎకరాకు నీళ్లివ్వలే: దత్తాత్రేయ

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా  ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించాలో చెప్పాలని ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ. రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నిరందించలేదన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులలో నీళ్ళ లేక ఎండిపోతున్నాయని..ప్రాజెక్టుల క్రింది రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీకి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీకి ఏకాభిప్రాయం లేదని..కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.చిదంబరం లాంటి వ్యక్తి ఆర్టికల్ 370 రద్దుని మతంతో ముడిపెట్టడం తగదన్నారు.

కేటీఆర్ జాతీయ వాదంని మత వాదంతో ముడిపెట్టడం సరికాదని.టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్  17 విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని సూచించారు. కేసీఆర్ 15 ఆగస్టు జాతీయ జెండా ఎగురవేసినట్లు సెప్టెంబర్17 న కూడా జాతీయ జెండా ఎగురవేయాలన్నారు.. ఎంఐఎంకు భయపడి టీఆర్ ఎస్ సెప్టెంబర్17 ని అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు.సెప్టెంబర్ 17 న తెలంగాణ గ్రామాల్లోకెళ్ళి విమోచన దినాన్ని జరుపుతామన్నారు దత్తాత్రేయ.