జగిత్యాలలో బీజేపీ నాయకులు అరెస్ట్

జగిత్యాలలో బీజేపీ నాయకులు అరెస్ట్

జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్ పల్లిలో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుట్ల పట్టనంలోని స్థానిక సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. కోరుట్ల మున్సిపల్  కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణంలో ఎన్నో ఏళ్లుగా సమస్యలు పేరుకుపోతున్నాయని.. పట్టించుకునే వారు లేరన్నారు. రోడ్లు బాగు చేయాలని, వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని నేతలు డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఆసరా, వృద్ధాప్య, వితంతు, బీడీ, చేనేత పెన్షన్లు ఇవ్వాలన్నారు. దళితబంధు, బీసీ బంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసుల చేత ప్రభుత్వం అక్రమ అరెస్ట్ లు చేయించడం సరికాదన్నారు నేతలు.