అంగన్ వాడీ టీచర్ల నుంచి డబ్బులు వసూళ్లపై లేఖలు : జగిత్యాల సంక్షేమ శాఖలో ఏసీబీ సోదాలు..!

అంగన్ వాడీ టీచర్ల నుంచి డబ్బులు వసూళ్లపై లేఖలు : జగిత్యాల సంక్షేమ శాఖలో ఏసీబీ సోదాలు..!

జగిత్యాల జిల్లాల్లో కలకలం. జిల్లా కలెక్టరేట్ లోని సంక్షేమ శాఖ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ప్రతి ఫైల్ ను తనిఖీ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. సంక్షేమ శాఖ ఉన్నతాధికారి నరేష్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నారు అధికారులు.

సంక్షేమ శాఖ జిల్లా అధికారి నరేష్ ఉన్నారు. ఆయన ఒక్కో అంగన్ వాడీ టీచర్ నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఏసీబీకి ఆకాశ రామన్న లేఖలు అందాయి. అదే విధంగా ఉన్నతాధికారులకు చాలా కంప్లయింట్స్ వెళ్లాయి. ఈ విషయంపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా మే 5వ తేదీ ఉదయం.. ఏసీబీ అధికారుల బృందం జగిత్యాల కలెక్టరేట్ లోని సంక్షేమ శాఖకు వచ్చింది. 

ఇటీవల తన కుమార్తె పెళ్లి చేసిన ఉన్నతాధికారి నరేష్.. ఒక్కో అంగన్ వాడీ టీచర్ నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఆకాశ రామన్న పేరుతో ఉన్నతాధికారులకు కంప్లయింట్స్ వెళ్లాయి. విచారణకు వచ్చిన ఏసీబీ అధికారులు.. ఇటీవల జగిత్యాల నుంచి వచ్చిన వరంగల్ ఆర్జేడీ అంగన్ వాడీ టీచర్లను విచారిస్తున్నారు. ఉన్నతాధికారి నరేష్.. గతంలో జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గా కూడా పని చేశారు. 

ALSO READ : కరీంనగర్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్

సంక్షేమ శాఖలో ఉన్న అన్ని ఫైల్స్ పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు... జిల్లా సంక్షేమ అధికారి హోదా నరేష్ తీసుకున్న నిర్ణయాలు.. పెట్టిన సంతకాల వెనక ఏమైనా అవినీతి ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.