V6 News

సింగిల్ గానే పోటీ చేస్తం.. మెజారీటీ సాధిస్తాం : బండి సంజయ్

సింగిల్ గానే పోటీ చేస్తం.. మెజారీటీ  సాధిస్తాం : బండి సంజయ్

తెలంగాణలో పార్టీలు  విలన్  పాత్రలు పోషిస్తున్నాయన్నారు బీజేపీ తెలంగాణ  చీఫ్ బండి సంజయ్.  బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.  టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రధాన విలన్లయిన రావుగోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, అల్లురామలింగయ్య పాత్రల్ని పార్టీలు  పోషిస్తున్నారని విమర్శించారు.    రావుగోపాల్ రావు పాత్రను బీఆర్ఎస్ పోషిస్తుంటే.. అల్లు రామలింగయ్య పాత్రను కాంగ్రెస్, మిగతా పార్టీలు కైకాల సత్యానారాయణ పాత్ర పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం యుద్ధం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. 

ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్నో పథకాలు వచ్చాయన్నారు బండి సంజయ్. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర నిధులను సర్కార్ దారి మళ్లిస్తోందని ఆరోపించారు. గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు.  బీజేపీ ప్రభుత్వ ఇంటింటికి  కరెంట్ కనెక్షన్  ఇచ్చిందన్నారు.   రైతు వేదికలకు  కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు .  పేద ప్రజలను కాపాడేది మోడీనే అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు.  మోడీ 9 ఏళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. 

యూపీలో జల్ జీవన్ మిషన్  లో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్లకు 16 వేల కోట్లు ఖర్చు పెడితే.. తెలంగాణలో మిషన్ భగీరథ కింద ఇంటింటికి నళ్లా పేరుతో 40 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. మిషన్ భగీరథ పెద్ద స్కాం అని ఆరోపించారు. అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలోని పలు చోట్ల ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వ లేదన్నారు. అలాగే చాలా చోట్ల మురికి నీరు వస్తుందన్నారు. 
బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. తెలంగాణలో  బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుందని.. మెజారిటీ సాధిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకపోయిందని బండి సంజయ్ అన్నారు. కర్ణాటకలో కేసీఆర్ కాంగ్రెస్ గెలపు కోసం పనిచేశారని ఆరోపించారు. జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ కు ఓటు వేసేలా చేశారన్నారు.