ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ ప్రమేయం ఉంది!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ ప్రమేయం ఉంది!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్  ప్రమేయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అందుకే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. పంజాబ్ లో లిక్కర్ సిండికేట్ చేసేందుకు కేసీఆర్ ఆ రాష్ట్రానికి వెళ్లినట్టుగా అనుమానం వస్తుందన్నారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు లిక్కర్ మాఫియాకు సంబంధించిన వ్యక్తులను కలిశారా లేదా అని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియా ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లింది నిజం కాదా అని నిలదీశారు. లిక్కర్ మాఫియాలో కాంగ్రెస్ వ్యక్తుల కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే లిక్కర్ దందా చేస్తున్నారన్నారు. లిక్కర్ స్కాంపై సమగ్ర విచారణ జరిపితే నిజాలు బయటపడతాయన్నారు. లిక్కర్ మాఫియాతో  కేసీఆర్ కుటుంబ సభ్యులకు బినామీలు అయినా రామచంద్ర పిళ్లై, శరత్, సృజన్ రెడ్డి, అభిషేక్ లతో సంబంధాలు ఉన్నాయా లేవా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించేందుకు మంత్రి కేటీఆర్ ఎక్కడికి పోయారని..ఆయన ఎందుకు ట్వీట్ చేయలేదన్నారు.

‘‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పెద్దమనిషి.. ఆయనకు చెప్పులు తీసిస్తే తప్పేముంది”అని బండి సంజయ్​ అన్నారు. లిక్కర్ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే షాకు చెప్పులు ఇచ్చింది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, ఎంఐఎం గూండాలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఎవరూ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బిజినెస్ మెన్లు ఇక్కడ వ్యాపారాలు చేయాలంటే భయపడుతున్నారన్నారు. ఒకవేళ బిజినెస్ చేస్తే కేసీఆర్ కుటుంబానికి వాటాలు, కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ది మేకపోతు గాంభీర్యం అని ..టీఆర్ఎస్  ప్రభుత్వానికి చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.