మణిఫూర్ లో భరత మాతను హత్య చేశారు : రాహుల్

మణిఫూర్ లో భరత మాతను హత్య చేశారు : రాహుల్

మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ ఉద్వేగంతో ప్రసంగించారు. ప్రధాని మోదీ టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని దృష్టిలో మణిపూర్ దేశంలో లేదని.. మణిపూర్ లో భరత మాతను హత్య చేశారని రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీరు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులు.. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా దేశాన్ని కూడా చంపారని ఆరోపించారు. హిందుస్తాన్ ను  మర్డర్  చేశారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ హిందుస్తాన్ మాట వినరని, కేవలం ఇద్దరి మాటే వింటారని ఫైర్ అయ్యారు. లంకను కాల్చింది రావణుడి అహంకారమే అంటూ వ్యాఖ్యలు చేశారు రాహుల్.  దీంతో సభలో బీజేపీ సభ్యులు నిరసన తెలిపారు.    

లోక్ సభలో రాహుల్ ప్రసంగం వాడీ వేడిగా సాగింది. ప్రధాని మోదీ వల్లే మణిపూర్ రెండు విడిపోయింది.. మణిపూర్ దేశంలో భాగం కాదా.. ప్రధాని మోదీ మణిపూర్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్ ఫైర్ అయ్యారు. దీంతో రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీజేపీ సభ్యులు ప్రయత్నించారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య పోటా పోలీ వాగ్వాదం జరిగింది. దీంతో విపక్షాల మాటలతో లోక్ సభ దద్దరిల్లింది.