ఫాంహౌస్ కేసులో ఆరోపణలపై బీఎల్ సంతోష్ రియాక్షన్

ఫాంహౌస్ కేసులో ఆరోపణలపై బీఎల్ సంతోష్ రియాక్షన్

ఫామ్ హౌస్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై BJP జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి BL సంతోష్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన సమాధానం చెబుతానని అన్నారు. తాను ఎవరో తెలియకపోయినా.. తన పేరు మాత్రం ఇంటింటికి వెళ్లిందన్నారు. తెలంగాణలో తన పేరు పాపులర్ అయిపోయిందన్నారు. తెలంగాణ తల్లి పేరుతో గెలిచి.. ఆ తల్లి రొమ్మును గుద్దారంటూ BRS నేతలను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలో దుర్మార్గపు పానలను పారద్రొలాలంటూ కార్యకర్తలకు సంతోష్ పిలుపునిచ్చారు. శామీర్‭పేటలో జరుగుతున్న బీజేపీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. బీజేపీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. 

మరోవైపు బలమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎలా చేస్తామని బీఆర్ఎస్ నేతలపై బీజేపీ మండిపడుతోంది. సమయం వచ్చినప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుందన్నారు. త్వరలోనే ప్రజలకు కూడా నిజనిజాలు తెలుస్తాయని బీజేపీ నేతలు అన్నారు.