ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టికెట్ల దందా..!

ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టికెట్ల దందా..!

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన టీజీ 20 లీగ్​లో ఈ -చాంపియన్స్ – మెదక్ ఫాల్కన్స్ మ్యాచ్ సందర్భంగా బ్లాక్ టికెట్ల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. మ్యాచ్‌‌కు భారీగా ప్రేక్షకులు తరలివస్తారని ముందే అంచనా వేసిన దళారులు, తక్కువ ధర టికెట్లను ముందుగానే బ్లాక్ చేసినట్లు సమాచారం.

డిస్ట్రిక్ట్​ యాప్‌‌లో రూ.49 టికెట్లు మ్యాచ్‌‌కు ముందుగానే సోల్డ్​ అవుట్​గా చూపించారని, స్టేడియం టికెట్ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు అందుబాటులో ఉంచలేదని అభిమానులు వాపోయారు. స్టేడియం పరిసరాల్లో ఒక్కో టికెట్​ రూ.150 నుంచి రూ.200 ఎక్కువకు అమ్ముతున్నట్లు ఆరోపించారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.