హైదరాబాద్: CMC ఫుడ్ సేఫ్టీ అధికారులు కూకట్‌పల్లిలోని KS బేకర్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి. ఫ్రీజర్‌లో వెజ్, నాన్-వెజ్ ఆహార పదార్థాలను ఒకేచోట నిల్వ చేయడం, వంటగదిలో బొద్దింకల బెడద, తుప్పుపట్టిన ఓవెన్లు, అపరిశుభ్రమైన టైల్స్‌ను అధికారులు గుర్తించారు.
🍽️ Food Safety Inspection Drive
— Cyberabad Municipal Corporation (@CMC_Offcl) June 27, 2026
Establishment: KS Bakers
📍 Kukatpally
📅 27.06.2026
As part of routine food safety inspections across Cyberabad, CMC Food Safety teams inspected KS Bakers.
✅ Good Practices
• Food handlers using aprons and hairnets
• Regular food and water… pic.twitter.com/8RR8jMME2t
ఈ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. నిర్దేశించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని, ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
