కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానిక లోటస్ హాస్పిటల్ సమీపంలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి తరచూ లీకేజీ సమస్య వస్తుండటంతో మంగళవారం పారిశుధ్య సిబ్బంది ప్రెషర్ పైపుతో క్లీన్ చేస్తుండగా.. నాలుగైదు రోజుల పాప మృతదేహం బయటపడింది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశామని, శిశువు డెడ్‌బాడీ డ్రైనేజీలోకి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
