అమితాబ్‌ బచ్చన్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

అమితాబ్‌ బచ్చన్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

ముంబైలోని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు కలకలం రేగింది. అబితాబ్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. అంతేకాదు. ముంబైలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చి వేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు అలర్టయ్యారు. బాంబ్ స్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. అమితాబ్ ఇంటితో పాటు పలు రైల్వేస్టేషన్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.

పోలీసుల సోదాలలో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు. దీంతో వారు ఇది ఫేక్ కాల్ అని స్పష్టం చేశారు. ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్‌లతో పాటు.. జుహులోని నటుడు అమితాబ్ బంగ్లా దగ్గర బాంబులు పెట్టామని తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేశారు. ఇప్ప‌టికే ఆగ‌స్టు 15న‌ స్వాతంత్ర్య దినోత్స‌వం సందర్భంగా  దేశంలోని ప‌లు ప్రాంతాల్లో పోలీసులు భ‌ద్ర‌త‌ను పెంచారు.