న్యూయార్క్: అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంతో అమెరికాలోని వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని ఆ దేశ ఫారిన్ రిలేషన్ కమిటీ చైర్మన్ జిమ్ రిష్ పేర్కొన్నారు. ఈ డీల్‌తో భారత మార్కెట్‌లో యూఎస్ ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డుకోవడంలో కూడా ఈ ఒప్పందం సహకరిస్తుందన్నారు.
‘‘ఇండో పసిఫిక్‌లో చైనా కుట్రలను అడ్డుకోవడంలో భారత్ ది కీలక పాత్ర. భారత్ అమెరికా డీల్‌తో రాబోయే రోజుల్లో రష్యా ఆర్థిక శక్తి మందగిస్తుంది. అది రష్యాను అడ్డుకునేందుకు, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా చేసేందుకు ఉపయోగపడుతుంది”అని జిమ్ రిష్ ట్వీట్ చేశారు. కొత్త ఒప్పందంతో భారత్‌కు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి పెరుగుతుందని అమెరికా వ్యవసాయ శాఖ సెక్రటరీ బ్రూక్ రోలిన్స్ కూడా పేర్కొన్నారు.
