
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీలో స్టార్ బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు కూడా ఉండడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నమోదవుతున్నాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ఈ మూవీలో ఇన్వాల్వ్ కావడంతో విడుదల కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే రణ్ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జునల ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్ర ట్రైలర్ పార్ట్ 1.. నేడు విడుదలైంది. దీంతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
And here it is, the Trailer of Brahmāstra. https://t.co/G05KBas7FQ
— BRAHMĀSTRA (@BrahmastraFilm) June 15, 2022
Get ready to enter a never seen before world of Ancient Indian Astras.
Watch Brahmāstra Part One: Shiva in cinemas on September 9th! #Brahmastra