లిక్కర్ కిక్కు..సర్కార్ కు రూ. 46 వేల 500 కోట్ల ఆదాయం

లిక్కర్ కిక్కు..సర్కార్ కు రూ. 46 వేల 500 కోట్ల ఆదాయం

తెలంగాణ ఖజానాకు మద్యం ఆదాయం కాసుల వర్షం కురిపించింది. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయి ఆదాయం సమకూరింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అంచనాలను మించి ఆదాయం వచ్చింది.

2025-2026  ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖకు మొత్తం 46 వేల 500 కోట్ల రూపాయల భారీ ఆదాయం లభించింది. కేవలం మద్యం అమ్మకాల ద్వారానే కాకుండా, లైసెన్స్‌లు, అప్లికేషన్ల ద్వారా కూడా ప్రభుత్వం భారీగా ఆర్జించింది. మద్యం దుకాణాల అప్లికేషన్ల రూపంలోనే సుమారు 3 వేల కోట్ల రూపాయలు రాగా.. ఇతర లైసెన్స్ ఫీజుల ద్వారా మరో 2,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

ALSO READ : కొత్త కోవిడ్ వేరియంట్ ‘సికాడా’

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్ షాపులు, 1,129 బార్ అండ్ రెస్టారెంట్లు  ఉన్నాయి. వీటికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా అప్లికేషన్ల ఫీజులు, వార్షిక లైసెన్స్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి కాసుల పంట పండింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మద్యం విక్రయాలు గణనీయంగా పెరగడమే ఈ రికార్డ్ స్థాయి ఆదాయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.