IPL 2026: పంజాబ్ Vs గుజరాత్ మధ్య హైవోల్టేజ్ ఫైట్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్XI ఇదే! 

IPL 2026: పంజాబ్ Vs గుజరాత్ మధ్య హైవోల్టేజ్ ఫైట్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్XI ఇదే! 

IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌ను ఘనంగా ప్రారంభించేందుకు పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు రెడీ అయ్యాయి. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ హోరాహోరీ పోరుకు వేదిక కానుంది. గత సీజన్‌లో ఫైనల్ వరకు వెళ్లి టైటిల్‌ని తృటిలో చేజార్చుకున్న పంజాబ్, ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. మరోవైపు గత సీజన్ ఎలిమినేటర్‌లో ఓడిన గుజరాత్ మరోసారి తమ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది.

పిచ్ రిపోర్ట్: 
న్యూ చండీగఢ్‌లోని ఈ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తుంది. ఇక్కడ సగటు స్కోరు: 170 పరుగులు నమోదు అవుతుంది. బ్యాటర్లు నిలదొక్కుకుంటే 200, -210 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.. కాగా, ఈ మ్యాచ్ సాగుతున్న కొద్దీ మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన టీమ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. 

ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లు: 11
* తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం: 6 సార్లు
* రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు విజయం: 5 సార్లు 
* సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు: 169
* ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు: 228/5
* ఈ గ్రౌండ్ లో అత్యల్ప స్కోరు: 95

హెడ్-టు-హెడ్:
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల రికార్డులు చూస్తే ఎవరూ తక్కువ కాదు.. ఇప్పటి వరకు ఇరు జట్లు 6 సార్లు తలపడగా, పంజాబ్ 3 సార్లు, గుజరాత్ 3 సార్లు విజయం సాధించాయి. సమ ఉజ్జీల మధ్య పోరు కావడంతో ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది.

తుది జట్ల అంచనా: 
పంజాబ్ కింగ్స్: 
ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కానోల్లి, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హార్ప్రీత్ బ్రార్, బెన్ డ్వార్షుయిస్, అర్ష్‌దీప్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్: 
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శారుఖ్ ఖాన్, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
ఇంపాక్ట్ ప్లేయర్: ఆర్. సాయి కిశోర్