సివరేజీ జీఐఎస్​ మ్యాపింగ్​కు బ్రేక్

సివరేజీ జీఐఎస్​ మ్యాపింగ్​కు బ్రేక్

10శాతం కూడా పూర్తికాని పనులు
లాక్​డౌన్​ సాకుగా చూపుతున్న అధికారులు
మ్యాన్​హోల్స్, సివరేజీ లేన్ల ఆన్​లైన్​ మానిటరింగ్​ కరువు

హైదరాబాద్, వెలుగు: సివరేజీ లేన్ల ఆన్ లైన్ మానిటరింగ్​కు వాటర్​బోర్డు చేపట్టిన జీఐఎస్(జియోగ్రాఫికల్​ ఇన్ఫర్మేషన్ సిస్టం) మ్యాపింగ్ పనులు ఏడాదైనా 10 శాతం కూడా కాలేదు.  కోర్ ​సిటీలో మొదలైన వర్క్స్​ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సిటీలో నిజాం కాలంలోనే 37 కిలోమీటర్ల మేర సివరేజీ లేన్​ ​నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 173 ట్రంక్ లేన్లు, 6,082 కిలో మీటర్ల డ్రైనేజీ లేన్ల నుంచి డైలీ1,700 ఎంఎల్​డీల మురుగు వస్తోంది.

కొన్నిచోట్ల పాత లేన్లు ఉండటంతో మెయిన్​ రోడ్లు, కాలనీల్లోని మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. వాటిని జీఐఎస్​కు అటాచ్​ చేసి యాప్ ద్వారా మానిటరింగ్ చేయాలని ఏడాది క్రితం వాటర్ బోర్డు నిర్ణయించింది. దాంతో ట్రంక్ లేన్ల పొడువు, ఏ టైమ్​లో మురుగు ప్రవాహం ఎక్కువ ఉంది, ఓవర్ ఫ్లో అవుతున్న మ్యాన్ హోల్ ఎక్కడున్నాయి అనేది కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంది. అలా సమస్యను గుర్తించి, సాల్వ్​ చేయాలని భావించింది. డివిజన్ల వారీగా ఉన్న సివరేజీ లేన్లను జనవరి నాటికి కంప్లీట్​చేస్తామని చెప్పినా 500 కిలోమీటర్ల మేర కూడా సర్వే పూర్తి కాలేదు. మార్చిలోగా 5 వేల కిలోమీటర్లు పూర్తవుతుందని చెప్పిన అధికారులు లాక్ డౌన్ కారణంతో మ్యాపింగ్ ప్రాసెస్​ఆగిపోయిందని చెప్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్