V6 News

బ్రేక్‌‌‌‌ డ్యాన్స్‌‌‌‌కు ఒలింపిక్‌‌‌‌ స్టేటస్‌‌‌‌

బ్రేక్‌‌‌‌ డ్యాన్స్‌‌‌‌కు ఒలింపిక్‌‌‌‌ స్టేటస్‌‌‌‌

లుసానే: అందరూ ముచ్చటపడి ఆసక్తిగా చూసే బ్రేక్‌‌‌‌ డ్యాన్స్‌‌‌‌కు.. ఒలింపిక్‌‌‌‌ హోదా దక్కింది. 2024 పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో దీనిని అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు.  స్ట్రీట్‌‌‌‌ డ్యాన్స్‌‌‌‌ బ్యాటిల్‌‌‌‌గా ముద్రపడిన ఈ బ్రేక్‌‌‌‌డ్యాన్స్‌‌‌‌ను మెడల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌గా తీసుకొస్తున్నామని ఐవోసీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ బోర్డు సోమవారం ఆమోద ముద్ర వేసింది. అర్బన్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ అయిన ఈ డ్యాన్స్‌‌‌‌కు పెద్ద సంఖ్యలో యంగర్‌‌‌‌ ఆడియన్స్‌‌‌‌ ఉంటారు.  ఇక టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లో తీసుకొస్తున్న స్కేట్‌‌‌‌బోర్డింగ్‌‌‌‌, స్పోర్ట్‌‌‌‌ క్లైంబింగ్‌‌‌‌, సర్ఫింగ్‌‌‌‌ను.. పారిస్‌‌‌‌ క్రీడల్లోనూ కొనసాగిస్తామని ఐవోసీ హామీ ఇచ్చింది.