- రంగు కాగితాలు విసరొద్దు : జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
- ఓల్డ్ సిటీలో రోడ్లు, లైటింగ్ మెరుగుపర్చాలన్న ఉత్సవ సమితి
అబిడ్స్, వెలుగు: నిమజ్జనంలో డీజేలు, ఎక్కువ శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్ వినియోగం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, శబ్ధ కాలుష్యం లేకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని గాంధీ సెంటినరీ హాల్‌లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి అధ్యక్షతన కో ఆర్డినేషన్మీటింగ్నిర్వహించారు. ఇందులో సజ్జనార్‌తోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పాల్గొన్నారు.
ఈసందర్భంగా సజ్జనార్మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా పంచే ప్రసాదం, ఇతర వ్యర్థాలు రోడ్లపై పడేయకుండా డస్ట్‌బిన్లలో వేయాలని సూచించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 90 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యిందని వెల్లడించారు. మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈసారి నిమజ్జనం మరింత సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టామని, చెరువుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
రంగు కాగితాలు తగ్గించాలి: ఆర్వీ కర్ణన్
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ టస్కర్లపై పెద్ద ఎత్తున రంగు కాగితాలను వినియోగించడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో నిమజ్జనం తర్వాత పారిశుద్ధ్య పనులు చేస్తుండగా ఓ కార్మికురాలు జారిపడి చనిపోయిందని గుర్తు చేశారు. రంగు కాగితాల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ట్యాంక్‌బండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశామని, అక్కడ సిబ్బంది పగలు, రాత్రి విధులు నిర్వహిస్తారని చెప్పారు.
ఓల్డ్ సిటీలో రోడ్లు బాగాలేవ్
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ ఓల్డ్‌సిటీలో దారుస్సలాం నుంచి ఏక్‌మినార్ వరకు రోడ్ల పరిస్థితి బాగాలేదన్నారు. బేగంబజార్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. లైటింగ్, తాగునీటి సదుపాయాలను మెరుగుపర్చాలని కోరారు.
సైబరాబాద్‌లో 465 మంది అదనపు సిబ్బంది
గచ్చిబౌలి: నిమజ్జనాలు, ట్రాఫిక్ నిర్వహణపై సైబరాబాద్ సీపీ రమేశ్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రతి పీఎస్పరిధిలో నిమజ్జనం పూర్తయిన విగ్రహాలు, ఇంకా నిమజ్జనం కావాల్సినవి ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనంలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. నిమజ్జనం కోసం 465 మంది అదనపు పోలీసు సిబ్బందిని సైబరాబాద్‌కు రప్పించామన్నారు. సీఎంసీ కమిషనర్ సృజన, జాయింట్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాసరావు, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు.
