- సైబరాబాద్ సీపీకి టీజీహెచ్‌ఆర్‌సీ ఆదేశాలు
అబిడ్స్, వెలుగు: హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మహిళపై హోంగార్డు దాడి చేసి, ఆమె జుట్టుపట్టి లాక్కెళ్లిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) స్పందించింది. సమగ్ర నివేదిక సమర్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ నెల 18న జరిగినట్లు పేర్కొంటున్న ఈ సంఘటనకు సంబంధించి శ్రేష్ఠ అనే మహిళ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దాడి మహిళ మర్యాద, గౌరవానికి భంగం కలిగించిందన్నారు. ఫిర్యాదుపై టీజీహెచ్‌ఆర్‌సీ చైర్మన్డాక్టర్జస్టిస్షమీమ్ అక్తర్ మంగళవారం విచారణ చేపట్టారు. మహిళపై దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నవంబర్ 17న నివేదిక సమర్పించాలని సీపీని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేశారు.
