పిల్లలకు స్వేచ్ఛనిస్తూ.. బాధ్యతలు నేర్పండి

పిల్లలకు స్వేచ్ఛనిస్తూ.. బాధ్యతలు నేర్పండి
  • సహచరి కార్యక్రమంలో సీపీ సుమతి


మల్కాజ్‌‌గిరి, వెలుగు: పిల్లలకు స్వేచ్ఛనిస్తూ బాధ్యతలు నేర్పాలని మల్కాజ్​గిరి సీపీ సుమతి అన్నారు. మల్కాజ్​గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గణేశ్​సురక్ష సంకల్ప్– 2026లో భాగంగా మంగళవారం కుషాయిగూడ శ్రీనివాస నగర్ కాలనీ పార్కులో సహచరి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, ఆహార భద్రత, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో పౌరులు 112 నంబర్‌‌కు డయల్ చేసి, పోలీసుల సహాయం పొందవచ్చని చెప్పారు. నేరాల నివారణకు, సురక్షిత సమాజ 
నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.