స్పోర్ట్స్ కోటా జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు 4 నెలల జీతాలు..రాష్ట్రవ్యాప్తంగా 161 మందికి లబ్ధి

స్పోర్ట్స్ కోటా జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు 4 నెలల జీతాలు..రాష్ట్రవ్యాప్తంగా 161 మందికి లబ్ధి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు (జేపీఎస్) ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరికి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న 4 నెలల వేతన బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా  161 మంది జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించి మార్చి నుంచి జూన్ వరకు మొత్తం రూ.46,23,759 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలాంటి జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం వెంటనే సంబంధిత జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పంపిణీ చేయాలని డీపీవోలను కమిషనర్ ఆదేశించారు. అలాగే ట్రెజరీల ద్వారా అర్హులైన జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వ్యక్తిగత ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేలా చూడాలని  డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగాన్ని కోరారు. ఈ ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతి నెలా 10లోపు కమిషనరేట్ కార్యాలయానికి సమర్పించాలని డీపీవోలకు స్పష్టం చేశారు.