డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు..అమిత్‌‌‌‌‌‌‌‌షా చేతుల మీదుగా ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌కు పురస్కారం

డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు..అమిత్‌‌‌‌‌‌‌‌షా చేతుల మీదుగా ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌కు పురస్కారం
  • కేంద్రం నిర్దేశించిన 7 అంశాల్లో 80 శాతానికి పైగా మార్కులు

న్యూఢిల్లీ, వెలుగు: డ్రగ్స్ అక్రమ రవాణా, మత్తు పదార్థాల వినియోగంపై తెలంగాణ చేపడుతున్న చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని యాంటీ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ (ఏఎన్‌‌‌‌‌‌‌‌టీఎఫ్‌‌‌‌‌‌‌‌) పనితీరును అంచనా వేసేందుకు నిర్దేశించిన ఏడు కీలక అంశాల్లో తెలంగాణ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో, ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ 80 శాతానికి పైగా మార్కులు సాధించాయి.

ల్లీలో నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ బ్యూరో (ఎన్‌‌‌‌‌‌‌‌సీబీ) ఆధ్వర్యంలో జరుగుతున్న మూడో జాతీయ యాంటీ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ అధిపతుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌షా చేతుల మీదుగా తెలంగాణ పోలీసుల తరఫున ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌ శాండిల్య జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రాల యాంటీ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ పనితీరును కేంద్రం ఏడు ప్రధాన అంశాల ఆధారంగా అంచనా వేసింది.  వాటిలో.. ‘ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్స్, ప్రీకర్సర్‌‌‌‌‌‌‌‌ కెమికల్స్, సింథటిక్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌పై నియంత్రణ, కేసుల ప్రాసిక్యూషన్, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ తగ్గింపు, హాని నివారణ చర్యలు, సమన్వయం, సామర్థ్య నిర్మాణం, పరిశోధన, విశ్లేషణ, పరిపాలన, లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌’ అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాల్లో తెలంగాణ 80 శాతానికి పైగా స్కోర్‌‌‌‌‌‌‌‌ సాధించింది. కేసుల ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌ను మరింత బలోపేతం చేసేందుకు చట్టపరమైన పరిశీలన, న్యాయపరమైన విశ్లేషణ, సాక్షుల రక్షణ, ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌ సహకారం వంటి అంశాల్లో ప్రత్యేక వ్యవస్థలను రాష్ట్రం ఏర్పాటు చేసింది.

గేట్‌‌‌‌‌‌‌‌వేలను అడ్డుకోవడమే లక్ష్యం: ఎస్పీ

మాదకద్రవ్యాల నిర్మూలనలో ‘తెలంగాణ ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌’ విశేష కృషి చేస్తోందని ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ సీతారాం తెలిపారు. ఢిల్లీలో జరిగిన యాంటీ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ అధిపతుల సదస్సులో ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌ శాండిల్య నేతృత్వంలో ఆయన ప్రెజెంటేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసుల వెనుక ఉన్న మొత్తం  నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను ఛేదించడమే ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్యమన్నారు. కిలోల నుంచి గ్రాముల స్థాయికి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ను కుదించామని పేర్కొన్నారు.

అల్ప్రాజోలం, ఎఫెడ్రిన్, మెఫెడ్రోన్‌‌‌‌‌‌‌‌ వంటి సింథటిక్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తయారీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లపై దాడులు చేసి.. భూ యజమానులు, రసాయనాల సరఫరాదారులు, ఫైనాన్షియర్లు, పంపిణీదారుల వరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ సొమ్ముతో కొనుగోలు చేసిన 23 ఆస్తులను స్వాధీనం చేసుకోగా, మరో 27 ఆస్తులపై చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.