ఫోర్ బిన్ల ద్వారా చెత్త వేరు చేయాలి

ఫోర్ బిన్ల ద్వారా  చెత్త వేరు చేయాలి

ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇంటి వద్దనే చెత్తను ఫోర్ బిన్ల ద్వారా వేరు చేసి ఇవ్వడం అలవాటు చేసుకోవాలని ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్వచ్ఛ భారత్ మిషన్–2026 మార్గదర్శకాలకు అనుగుణంగా ఫోర్​బిన్లపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం ఎంఎంసీ హెడ్డాఫీసులో ఫోర్​బిన్​సెగ్రిగేషన్ క్యాంపెయిన్‌‌తో పాటు ‘ఫ్లోరల్ వేస్ట్ టు ఆర్గానిక్ ప్రొడక్ట్స్’ కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. పూల వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి సేంద్రియ ఉత్పత్తులుగా మార్చే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. చిన్నారులు, యువతకు  అర్థమయ్యేలా రూపొందించిన పోర్టల్ ఆవిష్కరించడంతో పాటు మూడు ఎల్‌‌ఈడీ స్క్రీన్ ప్రచార వాహనాలను ప్రారంభించారు.  నిమజ్జన టైంలో ఉత్పత్తయ్యే పూలు, పచ్చ వ్యర్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాల్లోనే వేయాలని సూచించారు. అడిషనల్ కమిషనర్  రఘుప్రసాద్, ఏఈ నిఖిల పాల్గొన్నారు.