- బీసీ ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి వినతి
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రం బీసీ రక్షణ చట్టానికి రూపకల్పన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి బీసీ శాఖను ఆదేశించడం హర్షణీయమని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ పై వివిధ బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రక్షణ చట్టం చేసిందని, అదే తరహాలో తెలంగాణలోనూ చట్టం తీసుకురావాలని సీఎంను కోరామన్నారు.
ఇప్పుడున్న బీసీ కాలేజీ హాస్టళ్లలో సీట్లు లభించక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్లు, 120 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని విన్నవించినట్లు తెలిపారు. ఫీజుల బకాయిలను సాధ్యమైనంత తొందరగా దశలవారీగా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ మల్లేశ్‌యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేశ్, నాయకులున్నారు.
