తెలంగాణ ఫోక్ ఫ్లేవర్‌‌ తో శ్రీలత.. 

తెలంగాణ ఫోక్ ఫ్లేవర్‌‌ తో శ్రీలత.. 

ప్రియదర్శి హీరోగా, తెలంగాణ ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్‌‌గా సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్లపై  వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఇడుపు కాయితం’.  డిసెంబర్‌‌‌‌లో  సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన  టీమ్.. ఈ చిత్రం నుంచి  ‘శ్రీలత..’ సాంగ్‌‌ను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ ‘ఈ  పాటకు వస్తున్న రెస్పాన్స్  చాలా ఆనందాన్ని ఇస్తోంది. 

తెలంగాణ ఫోక్ ఫ్లేవర్‌‌తో పాటు కమర్షియల్ టచ్ ఉండేలా పాటను రూపొందించాం. ఈ పాటలో నేను కూడా  నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది’ అని చెప్పాడు. ఈ పాటకు లిరిక్స్ అందించిన  రచయిత అలరాజు మాట్లాడుతూ ‘నేను ఇప్పటిదాకా దాదాపు 40 చిత్రాలకు సాంగ్స్ రాశాను. 

కానీ  ఈ పాట నాకు మంచి గుర్తింపును తెచ్చింది.  సినిమాలో చూసినప్పుడు పాట మరింతగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.  ‘ఇడుపుకాయితం’ గీత రచయితగా నా  బతుకును మార్చిన కాగితం’ అని ఆనందం వ్యక్తం చేశాడు.